News January 20, 2026
క్రిటికల్ కేర్ యూనిట్‌కు మోక్షం.. ప్రారంభించనున్న మంత్రి అడ్లూరి

జగిత్యాల ధరూర్ క్యాంపులోని క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోక ఇన్నాళ్లు పెండింగ్లో ఉంది. రూ.23.5 కోట్లతో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల అత్యవసర సమయాల్లో ప్రమాద, అనారోగ్య బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల కోడ్ రానున్న కారణంగా ఈరోజు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఈ యూనిట్‌ను ప్రారంభించనుండగా, ఉపయోగంలోకి రానుంది.
Similar News
News February 16, 2026
కొత్తగూడెంలో ‘ఎర్రదండు’ కార్పొరేటర్లు..!

కొత్తగూడెం మేయర్ ఎన్నిక వేళ సీపీఐ కార్పొరేటర్లు సరికొత్తగా మెరిశారు. ఎర్రజెండా సిద్ధాంతానికి ప్రతీకగా ఆ పార్టీకి చెందిన 22 మంది కార్పొరేటర్లు ఎర్రటి చీరలు, ఎర్ర చొక్కాలు ధరించి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కార్పొరేషన్ కార్యాలయం అంతా ఎరుపు రంగుతో నిండిపోవడంతో కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఎర్రదళం రాకతో కొత్తగూడెం కార్పొరేషన్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది.
News February 16, 2026
సాంయంత్రం 6 దాటాకే ఆర్కే బీచ్‌కు అనుమతి..

విశాఖ బీచ్ రోడ్డులో ఈనెల 16, 17 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ICP-2026 ప్రాక్టీస్ పరేడ్ జరగనుంది. ఈ సమయంలో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీకి కేటాయించారు. ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. సందర్శకులు సాయంత్రం 6 గంటల తర్వాతే బీచ్‌కు రావాలని పోలీసులు కోరారు.
News February 16, 2026
ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.


