News December 26, 2024
క్రిస్మస్ వేడుకలతో దద్దరిల్లిన మహబూబ్‌నగర్
క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్‌లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.
Similar News
News December 26, 2024
NGKL ఎంపీని కలిసిన పీయూ ఉపకులపతి
హైదరాబాదులోని NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
News December 26, 2024
MBNR: నేడు జిల్లాకు కేంద్రమంత్రి రాక
నర్వ మండలం రాయి కోడ్ గ్రామానికి, గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ వస్తున్నట్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. నర్వ మండల, గ్రామాల బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
News December 26, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!
✔ఘనంగా క్రిస్మస్ వేడుకలు✔ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి✔NGKL: పోలీస్ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు✔వనపర్తి: అయ్యప్ప ఆలయంలో స్వచ్ఛభారత్✔ఒకవైపు ముసురు..మరోవైపు చలి✔CM ఇలాకాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు✔NRPT: మూడు రోజులు త్రాగునీటి సరఫరా నిలిపివేత✔సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దు:SPలు✔PUలో క్రీడాకారులకు ట్రాక్ సూట్, యూనిఫామ్స్ అందజేత