News September 20, 2025
క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

తూ.గో జిల్లా యువ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ కప్ – 2025లో సాధించిన విజయంపై కలెక్టర్ కీర్తి చేకూరి అభినందనలు తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో క్రీడాకారులు కలెక్టర్‌ను కలుసుకొని, తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు గౌరవం తీసుకొచ్చిన మీరంతా ఇతరులకు ఆదర్శం, మీ కృషి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
తూ.గో జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర

తూ.గో జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎప్సీ నరసింహ కిషోర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టామని సిబ్బంది తెలిపారు. తొలుతు పోలీస్ స్టేషన్ ఆవరణాలను శుభ్రం చేశారు. చెత్తచెదారాలు, పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు చెప్పారు.
News September 20, 2025
పశువుల వ్యాధి నియంత్రణకు జాగ్రత్తలు చేపట్టాం: కలెక్టర్

తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామంలో పశువుల వ్యాధి నియంత్రణకు గ్రామస్థాయి జాగ్రత్తలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామంలో పశువులకు థైలీరియాసిస్ & అంపిస్టోమియాసిస్ పూర్వస్థాయి కేసులు గుర్తించబడ్డాయన్నారు. వ్యాధి సోకిన పశువులకు తక్షణ చికిత్స, నిరోధక ప్రోటోకాల్ అమలు చేస్తున్నామన్నారు. మిగతా పశువులకు నివారణ మందులు అందిస్తున్నట్లు చెప్పారు.
News September 20, 2025
రాజమండ్రి: ‘సెలవుల్లో పాఠశాలలు తెరిస్తే చర్యలు’

ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో వాసు దేవరావు హెచ్చరించారు. ప్రభుత్వం నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. 22నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు.