News July 5, 2024

క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోండి: క్రీడాభివృద్ది అధికారి

image

పాడేరు: కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోవాలని అల్లూరి జిల్లా క్రీడాభివృద్ది అధికారి జగన్మోహన్ రావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ దరఖాస్తులకు అర్హులన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆగష్టు 1వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని, విజయవాడలోని క్రీడా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Similar News

News July 8, 2024

అనకాపల్లి: ఆచూకీ చెబితే రూ.50వేలు బహుమతి

image

రాంబిల్లి మండలం కొప్పుగుంటపాలెంలో బాలికను హత్య చేసిన హంతకుడి వివరాలు తెలిపితే రూ.50 వేలు బహుమతి అందజేస్తామని అనకాపల్లి పోలీస్ శాఖ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హంతకుడి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రకటన విడుదల చేసింది. హంతకుడి పేరు బోడాబత్తుల సురేశ్‌గా పేర్కొంది. ఆచూకీ తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, 94407 96084 నంబర్‌కు తెలియజేయాలని కోరింది.

News July 8, 2024

విశాఖ ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ ప్రోగ్రాం ప్రారంభం

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. గంభీరంలోని ఐఐఎం క్యాంపస్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఐఎం సంచాలకులు ఆచార్య ఎం.చంద్రశేఖర్ హాజరయ్యారు. విభిన్న రంగాల్లో అపార అనుభవం కలిగిన నిపుణులకు పీహెచ్డీలో ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం డీన్ కావేరి కృష్ణన్, రీసెర్చ్ డీన్ అమిత్ శంకర్ పాల్గొన్నారు.

News July 8, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డల్లాస్‌లో నిరసనలు

image

అమెరికాలోని డల్లాస్‌లో థామస్ జేఫర్ సన్ పార్కులో ప్రవాసాంధ్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సెయిల్ ‌లో స్టీల్ ప్లాంట్ ‌ను విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు తెలుగు వారి గండె చప్పుడుగా పేర్కొన్నారు.