News November 24, 2024
క్రీడాభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి: విశాఖ కలెక్టర్
విశాఖ జిల్లాలో క్రీడల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా సంఘాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవోతో పాటు ఒలింపిక్ సంఘం పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2024
విశాఖ: 25, 26 తేదీల్లో పలు రైళ్లు రద్దు
ఈనెల 25న విజయవాడ-విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-విశాఖ-కాకినాడ మెము ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి పాసింజర్ రైలు రద్దు చేశామన్నారు. 26న విశాఖ గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
News November 23, 2024
పచ్చ మంద దుష్ప్రచారం: గుడివాడ అమర్నాథ్
చంద్రబాబు ఏం చేసినా ఒప్పు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ్చ మంద దుష్ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.6.99 లకు కొంటే తప్పులేదు కానీ జగన్ కేవలం యూనిట్ రూ.2.49లకు కొంటే మాత్రం తప్పు అన్నట్లుగా ప్రచారం చేస్తుందని శనివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
News November 23, 2024
నాపై కేసు కొట్టేయండి: హోం మంత్రి అనిత
హోం మంత్రి అనిత చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి రాజీ కుదుర్చుకున్నానని తనపై కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70 లక్షలు అప్పుతీసుకున్నారు. 2018లో అప్పుకు అతనికి చెక్కును ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా.. ఇటీవల ఆమె హోం మంత్రి అయ్యాక రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.