News January 5, 2026

క్రీడా పోటీల ఏర్పాట్లపై కలెక్టర్ అసంతృప్తి

image

భద్రాద్రి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పినపాక మండలం ఈ బయ్యారం క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. పోటీలకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, కొన్ని శాఖల అధికారుల పనితీరు సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండా సమన్వయంతో పని చేయాలని స్పష్టంచేశారు

Similar News

News February 17, 2026

ఘనంగా యాదాద్రి శ్రీరామలింగేశ్వర స్వామికి రథోత్సవం

image

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి‌. ఇందులో భాగంగా సోమవారం రాత్రి దివ్య విమాన రథోత్సవం ఘనంగా నిర్వహించారు. శివపార్వతులను రథంలో ఉంచి, పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

News February 17, 2026

పోలీస్ పీజీఆర్ఎస్‌లో 72 పిటిషన్ల స్వీకరణ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ జగదీశ్ 72 పిటిషన్లు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా కార్యాలయానికి విచ్చేసిన ఓ దివ్యాంగురాలి వద్దకే ఎస్పీ స్వయంగా వెళ్లి పిటిషన్ స్వీకరించి మానవత్వాన్ని చాటుకున్నారు.

News February 17, 2026

ఆలేరు: అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరు మృతి

image

అదుపుతప్పి కారు బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందిన ఘటన యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో తన తల్లి అంత్యక్రియలు హాజరయ్యేందుకు ఆలేరు నుంచి క్వాలిస్ వాహనంలో తూర్పు గూడెం వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో మల్లిక అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.