News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 18, 2025
తిరుపతి: HM ప్రోత్సాహంతో UPSC ర్యాంకు.!

తిరుపతి సింగాలగుంటకు చెందిన దాసరి ఇందుమతి<<18598708>> UPSC<<>> IES (electrical engineering)లో 75వ ర్యాంకుతో సత్తా చాటింది. ఆమె టీటీడీ SGS హై స్కూల్‌లో 10 తరగతి, SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా, బీటెక్ గుంటూరులో పూర్తి చేసింది. TTD HM కృష్ణమూర్తి ప్రోత్సాహంతో, తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం ఇచ్చేలా తన లక్ష్యం చేరుకున్నానని ఆమె Way2Newsకు వివరించింది.
News December 18, 2025
తమిళనాడు బోట్లతో తీవ్ర ఇబ్బందులు: కలెక్టర్

తమిళనాడు నుంచి జిల్లాలోని సముద్ర జిల్లాలోనికి అక్రమంగా బోట్లు వస్తున్నాయని కలెక్టర్ హిమాన్ష శుక్లా అన్నారు. అమరావతిలో CM ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్షలో ఆయన మాట్లాడారు. తమిళనాడు బోట్లతో జిల్లా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్ష్ CMకు విన్నవించారు. జువ్వలదిన్నె హార్బర్‌ను కార్యాచరణలోకి తీసుకొస్తే సమస్యను పరిష్కరించవచ్చన్నారు.
News December 18, 2025
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పలు పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఆగస్టు 2025లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్, ఫార్మ్-డి రెండో ఏడాది రీ వాల్యుయేషన్ పరీక్షలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసి రీ వాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని KRU పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.


