News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 14, 2025
కరీంనగర్‌లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలోని ఐదు మండలాల్లో జరుగుతున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, 162 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని స్క్రీన్‌లపై పోలింగ్ ప్రక్రియను వీక్షించిన కలెక్టర్, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించారు.
News December 14, 2025
MDK: కొడుకుపై తండ్రి గెలుపు

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్‌గా మానేగళ్ల రామకృష్ణయ్య 99 ఓట్లతో తన కొడుకు వెంకటేష్ పై ఘనవిజయం సాధించారు. రామకృష్ణయ్యకు 684 ఓట్లు పోలవగా, కుమారుడు వెంకటేష్‌కు 585 ఓట్లు పోలయ్యాయి. 99 ఓట్ల మెజార్టీతో రామకృష్ణయ్య గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
News December 14, 2025
శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాల్లో ప్రతిరోజూ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామస్థులకు శాంతిభద్రతలు, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


