News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 14, 2025

MDK: వరించిన అదృష్టం.. డ్రాలో సర్పంచ్ పదవి

image

మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. కేతవత్ సునీత (కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి నోటకు పడింది. ఇద్దరికీ సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతవత్ సునీతకు విజయం వరించింది.

News December 14, 2025

జగిత్యాల: ఫైనల్ పోలింగ్ శాతం వివరాలు

image

జగిత్యాల జిల్లాలో రెండో విడతలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. బీర్పూర్ మండలంలో 80.25%, జగిత్యాల అర్బన్ మండలంలో 81.26%, జగిత్యాల రూరల్ మండలంలో 77.69%, కొడిమ్యాల మండలంలో 78.43%, మల్యాల మండలంలో 77.06%, రాయికల్ మండలంలో 79.11%, సారంగాపూర్ మండలంలో 77.61% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తంగా జిల్లాలోని ఏడు మండలాల్లో 78.34% ఓటింగ్ నమోదయిందన్నారు.

News December 14, 2025

చిత్తూరులో పెంపుడు కుక్కకు సమాధి

image

తమ కుటుంబంలో ఒకరిలా గారాబంగా పెంచుకున్నారు. వారితో పాటే అన్నం పెట్టారు. స్నానం చేయించారు. వారి మధ్యే నిద్ర కూడా పోనిచ్చేవారు. చివరికి తమని వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా! చిత్తూరు పట్టణంలోని గ్రీమ్స్ పేటలో ఓ పెంపుడు కుక్క స్టోరీ ఇది. అది చనిపోవడంతో దానిని మర్చిపోలేక సమాధి కట్టించాడు యజమాని. ఈ వింతను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.