News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
‘తెల్లపారుడు వ్యాధి’ని కోళ్లలో ఎలా గుర్తించాలి?

‘సాల్మొనెల్లా పుల్లొరం’ బ్యాక్టీరియా వల్ల కోడి పిల్లల్లో తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.
News February 18, 2026
ఏపీలో క్రికెట్ ఆడే వారికి గుడ్‌న్యూస్!

క్రికెట్ బాగా ఆడే యువతకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త ప్రోగ్రామ్ తీసుకురాబోతోంది. ఏప్రిల్ 5న దీనిని లాంచ్ చేసే అవకాశముంది. 19 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులకు ప్రిఫరెన్స్ ఉంటుందని, 19+ వారిని నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేస్తారని సమాచారం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 88 నియోజకవర్గాల్లో ఒక్కో దాని నుంచి 20-50 మందికి అవకాశం కల్పించనున్నట్లు ACA వర్గాలు చెబుతున్నాయి.
News February 18, 2026
సదాశివనగర్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించిన కలెక్టర్

సదాశివనగర్ మండలం తీర్మన్‌పల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. తరగతి గదులకు వెళ్లిన కలెక్టర్.. విద్యార్థుల చదవడం, రాయడం, ఇంగ్లిష్, గణితం వంటి అభ్యాస సామర్థ్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులను అభినందించి, వారికి నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.


