News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 15, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*TG: రెండో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి.. మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులు
*ఆస్ట్రేలియా సిడ్నీ బీచ్‌లో యూదులపై కాల్పులు.. 12 మంది మృతి
*మూడో టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
*మోదీ, షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారన్న రాహుల్ గాంధీ.. ఢిల్లీలో సభ
*అనకాపల్లిలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
News December 15, 2025
సంగారెడ్డి: జిల్లాలో ప్రశాంతంగా రెండో విడత ఎన్నికలు

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత పది మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ ప్రావీణ్య ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా సంఘటనలు జరగలేదని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడో విడత కూడా ఇదే స్పూర్తితో పని చేయాలని తెలిపారు.
News December 15, 2025
కాంగ్రెస్ “ఓట్ చోరీ” సభ అట్టర్ ఫ్లాప్: కిషన్ రెడ్డి

“ఓట్ చోరీ” పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన <<18562660>>సభ<<>> అట్టర్ ఫ్లాప్ అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘రాహుల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ అంటూ దుష్ప్రచారానికి తెరతీశారన్న విషయం ప్రజలకు అర్థమైంది. కార్యకర్తలను బిజీగా ఉంచుకోవడానికి మాత్రమే ఈ ట్రిక్కులు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ సభ్యులను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.


