News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 20, 2025

కేయూ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 22 నుంచి ప్రారంభం కావాల్సిన బీటెక్ 3, 5, 7వ సెమిస్టర్ పరీక్షలను డిసెంబరు 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎమీ ఆసీం ఇక్బాల్‌తో కలిసి శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పూర్తి రీషెడ్యూల్ టైం టేబుల్‌ను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

News December 20, 2025

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

భద్రకాళి ఆలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. పుష్య మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

News December 20, 2025

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరికొంతమంది ప్రముఖుల పేర్లు

image

US లైంగిక నేరగాడు <<18618704>>ఎప్‌స్టీన్<<>> కాంటాక్ట్ బుక్‌లో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత Dr.ఎలీ వీజెల్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్ మాజీ CEO బ్రోన్ఫ్‌మాన్, UK మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, స్పెయిన్ మాజీ ప్రధాని జోస్ అజ్నార్‌తో పాటు పలువురు రాజకీయ, మీడియా రంగ దిగ్గజాలు ఉన్నారు. అయితే పేర్లు ఉన్నంతమాత్రాన వాళ్లు నేరం చేసినట్లు కాదని DOJ స్పష్టం చేసింది.