News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 14, 2025

రాంనగర్‌లో విషాదం: నాడు తండ్రి.. నేడు కుమారుడు!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌లో విషాదం అలుముకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తూ వరుస సోదరులు బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ల క్రితం తండ్రి ఉప్పలయ్య ప్రమాదంలో మరణించగా అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ నవీన్ ఇప్పుడు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంగా మారింది. పెళ్లి ఏర్పాట్ల వేళ ఈ దుర్ఘటన కుటుంబాన్ని కంటతడి పెట్టించింది.

News December 14, 2025

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా గోయల్

image

నూతన ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రభుత్వ మాజీ ఉద్యోగి రాజ్‌కుమార్ గోయల్ అపాయింట్ అయ్యారు. ప్రధాని మోదీ సారథ్యంలోనే ముగ్గురు సభ్యుల కమిటీ ఈయన పేరును ఎంపిక చేసింది. మరో 8మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్‌లనూ ప్యానెల్ సిఫార్సు చేసింది. రేపు RK గోయల్‌తో CICగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఈయన అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం యూనియన్ టెరిటరీస్ క్యాడర్‌కు చెందిన 1990వ బ్యాచ్ IAS(రిటైర్డ్).

News December 14, 2025

AIIMS మంగళగిరి 76 పోస్టులకు నోటిఫికేషన్

image

<>AIIMS<<>> మంగళగిరి 76 Sr రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD/MS/DNB/DM/Mch, MSc, M.Biotech, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, STలకు రూ.1000. JAN 6-8వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in