News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 15, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 90 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందినట్లు SP కార్యాలయం ప్రకటించింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎస్పీ మీకోసం కార్యక్రమంలో పాల్గొని, ఫిర్యాదుదారుల సమస్యలను పూర్తిస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ శాఖ అధికారులకు వెంటనే విచారణ నిర్వహించి మీకోసం ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు.

News December 15, 2025

కాశీబుగ్గ: 600 ఖాళీలకు..జాబ్ మేళా

image

కాశీబుగ్గలోని శ్రీ సాయి శీరిషా డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఈనెల 20న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. ఆయా కంపెనీల్లోని ఖాళీగా ఉన్న 600 ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిటెక్, ITI చదివిన అభ్యర్థులకు అవకాశం ఉంటుందన్నారు.

News December 15, 2025

వాస్తు నియమాలు ఎందుకు పాటించాలి?

image

ప్రకృతి, మానవ జీవన మనుగడలను సమన్వయం చేస్తూ మనల్ని రక్షించే శాస్త్రమే ‘వాస్తు’ అని, మన క్షేమం కోసం వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని అంటున్నారు. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమే అంటున్నారు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుందని కుటుంబలో ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>