News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 15, 2025
కర్నూలు రేంజ్ పరిధిలో 31 మంది సీఐల బదిలీ

కర్నూలు రేంజ్ పరిధిలోని 31 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 18 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. పరిపాలన సౌలభ్యం, సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్వహణ దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు డీఐజీ తెలిపారు.
News December 15, 2025
గాజువాకలో యువతి ఆత్మహత్య

గాజువాకలోని జింక్ గేటు ఎదురుగా గల 59వ వార్డ్‌లోని హిమచల్ నగర్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న గిడుతూరు సాయి కుమారి (23) తన ఇంట్లో ఆదివారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు గమనించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గాజువాక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి మృతికి గల కారణాలు తెలియల్సి ఉంది.
News December 15, 2025
విశాఖ పోర్టు పాలన గాడి తప్పుతోందా.?

విశాఖ పోర్టు ఛైర్మన్ అంగముత్తు ముంబైకు బదిలీ అయినా ఇక్కడ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. నెలలో ఒకటీరెండు సార్లే విశాఖకు వస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సెక్రటరీ వేణుగోపాల్ సైతం ఇతర పోర్టులకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. పూర్తిస్థాయి ఛైర్మన్, డిప్యూటీలు సైతం లేకపోవడంతో పోర్టు పాలన గాడి తప్పుతుందనే విమర్శలు ఉన్నాయి. కీలక ఫైళ్లు ముందుకు సాగడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు.


