News April 26, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 15, 2025

శ్రీకాకుళం జిల్లా మార్పుపై డిమాండ్

image

పలాసను కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై అన్ని పార్టీ నాయకులు కలిసికట్టుగా సహకరించాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి.కృపారాణి పేర్కొన్నారు. ఆదివారం టెక్కలిలోని ఆమె కార్యాలయంలో పలాస జిల్లా సాధన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా పలాస జిల్లా ఏర్పడితే మొట్టమొదటిగా లాభపడేది ఇచ్ఛాపురం నియోజకవర్గమేనని, వారి సహకారం అవసరమన్నారు. పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

News December 15, 2025

రబీ సాగు నిరాశాజనకం

image

APలో రబీ సాగు ఆశించినస్థాయిలో సాగడం లేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు. మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా ఖరీఫ్ పంటల కోతలు ఆలస్యమవడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ కింద వరి సాగుకు నీటి గ్యారంటీ లేకపోవడమూ మరో కారణమని పేర్కొంటున్నారు.

News December 15, 2025

HYD: న్యూ ఇయర్ కోసం వెయిటింగా? మీకోసమే

image

HYD న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. DEC 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు పబ్‌లు, బార్‌లు, హోటళ్లలో CCకెమెరాలు, సెక్యూరిటీ తప్పనిసరి. మైనర్లకు ఎంట్రీ, మద్యం నిషేధం, డీజేలు, అశ్లీల నృత్యాలు, రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. మద్యం తాగి వాహనం నడిపితే కేసులు, జరిమానా, జైలు శిక్ష విధిస్తామని CP సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్లు రాత్రి 12:30లోపు ముగించాలన్నారు.