News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 15, 2025
అమరజీవి త్యాగం చిరస్మరణీయం: జేసీ

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి వల్లే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని జేసీ అపూర్వ భరత్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి లల్లి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
News December 15, 2025
Eggoz కాంట్రవర్సీ.. గుడ్లను పరీక్షించనున్న FSSAI

Eggoz బ్రాండ్ గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందనే వార్త ప్రస్తుతం SMలో తెగ వైరలవుతోంది. యూట్యూబ్ ఛానెల్ ‘ట్రస్టిఫైడ్’ వీడియోతో ఈ ‘ఎగ్గోజ్’ వివాదం మొదలైంది. తాజాగా దీనిపై FSSAI స్పందించింది. గుడ్లలో విషపూరితమైన రసాయనం ‘నైట్రోఫ్యూరాన్స్’ ఉందా? లేదా? అనేదానిపై పరీక్షలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ గుడ్ల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపాలని ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది.
News December 15, 2025
కాకినాడలో వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు సందర్భంగా వైసీపీ శ్రేణులు సోమవారం కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, కార్యకర్తలు భానుగుడి నుంచి బాలాజీ చెరువు వరకు ప్రదర్శనగా తరలివచ్చారు. వైఎస్ విగ్రహం వద్ద సంతకాల ప్రతులను ఉంచి నివాళులర్పించారు. దాడిశెట్టి ఆధ్వర్యంలో వీటిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.


