News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 18, 2025

ఇన్సూరెన్స్ కాల్స్ ‘1600’ నంబర్ల నుంచే రావాలి: TRAI

image

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్ అన్నీ తప్పనిసరిగా 1600 సిరీస్ నంబర్ల నుంచే రావాలని పేర్కొంది. ఈ నిబంధనను IRDAI పరిధిలోని అన్ని బీమా సంస్థలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫేక్ కాల్స్, ఇన్సూరెన్స్‌ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతుందని TRAI భావిస్తోంది.

News December 18, 2025

చిత్తూరు: ఉగాదికి గృహప్రవేశాలు..!

image

చిత్తూరు జిల్లాలో వచ్చే ఉగాది నాటికి పక్కా గృహాల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా హౌసింగ్‌పై CM సమీక్షించారు. జిల్లాలో PMAY కింద గతంలో 73,098 గృహాలు మంజూరు కాగా 58,966 పూర్తయ్యాయి. మరో 11,048 పక్కా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. పాతవి 9,912 కొత్తగా మంజూరైన 2,105 గృహాలను కలిపి 12,048 గృహాలను ఉగాది నాటికి సిద్ధం చేయాలన్నారు.

News December 18, 2025

భారత్‌కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం

image

ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన ఫైనల్ పోటీల్లో కర్ణాటకకు చెందిన విద్యా సంపత్‌ మిసెస్‌ ఎర్త్‌ ఇంటర్నేషనల్‌-2025గా నిలిచారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి భారత్‌కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందిచారు విద్య.