News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 8, 2026
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: భూపాలపల్లి ఎస్పీ

భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎలక్షన్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తామని, అన్ని పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని చెప్పారు.
News February 8, 2026
GWL: ఎన్నికల విధులకు 375 మంది పోలీసులు: SP

ఈనెల 11న గద్వాల జిల్లాలో జరిగే మూడు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల విధులకు 375 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 5:00 ప్రచార సమయం ముగుస్తుందని ఆ తర్వాత ఎవరు ప్రచారం చేయరాదని హెచ్చరించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందన్నారు. వాటిని గ్రహించి అభ్యర్థులు నడుచుకోవాలన్నారు.
News February 8, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

▶︎ నందిగం: వ్యాన్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు
▶︎ మరో ప్రమాదంలో యువకుడు మృతి
▶︎ మందస: బాలిగాం రమంలోని ఇళ్లల్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ
▶︎ గ్రామీణ రహదారులకు రూ.10.87 కోట్లు: ఎమ్మెల్యే శంకర్
▶︎ మందస: ఈనెల 13 వరకు వాసుదేవుని బ్రహ్మోత్సవాలు
▶︎ సోంపేటలో జర్నలిస్టుల శిక్షణ తరగతులు
▶︎ ఎచ్చెర్ల: అడుగుకో గుంత..వెళ్లేదెలా


