News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 7, 2026
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను బహూకరించారు.
News January 7, 2026
9న ఒంగోలులో జాబ్ మేళా..రూ.22వేల శాలరీ!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 18 నుంచి 30ఏళ్ల మధ్యగల యువతీ, యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. 10 నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని, నియమితులైనవారికి 22వేల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు.
News January 7, 2026
IRCTC ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు గుడ్‌న్యూస్

IRCTC ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ ఓపెనింగ్ డే (60 రోజుల ముందు)లో ఉదయం 8 నుంచి సా.4 గంటల వరకు టికెట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆధార్ లింక్ లేకుంటే సా.4 గంటల తర్వాత మాత్రమే బుక్ చేసుకోగలరు. అయితే, JAN 12 నుంచి వెరిఫైడ్ యూజర్ల బుకింగ్ టైమ్ రాత్రి 12 గంటల వరకు పొడిగించనుంది. దీంతో, నాన్ వెరిఫైడ్ యూజర్లు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోలేరు.


