News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 16, 2025
గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
News December 16, 2025
విశాఖ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో మధురవాడ టాప్!

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు విశాఖలోని 9 సబ్ రిజిస్ట్రర్ కార్యలయాలలో రూ.200 కోట్ల ఆదాయంతో మధురవాడ మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానంలో సూపర్ బజర్ రూ.172 కోట్లతో నిలిచింది. చివరి స్థానంలో గోపాలపట్నం నిలిచింది. అయితే విశాఖలో రిజిస్ట్రేషన్ కార్యలయాల ద్వారా గత ఏడాది ఈ సమయానికి రూ.681.11 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.771.65 కోట్లు అదాయాన్ని గడించింది.
News December 16, 2025
టీచర్లకు బోధనేతర పనులొద్దు!

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని టీచర్లకు బోధనేతర పనులు కేటాయించొద్దని అధికారులకు విద్యాశాఖ కమిషనర్ వి.విజయరామరాజు ఆదేశాలిచ్చారు. టెన్త్ విద్యార్థులకు రోజూ స్లిప్ టెస్టులు నిర్వహించాలన్నారు. కాగా పాఠశాల స్థాయిలోనే క్వశ్చన్ పేపర్లు తయారుచేసే వెసలుబాటు కల్పించారు. గతేడాది వాటిని పైస్థాయి నుంచి పంపేవారు. ఉత్తీర్ణత శాతం పెంపు బాధ్యత కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారిపై ఉండనుంది.


