News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 23, 2025
నేడు నల్గొండకు KTR

ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లా కేంద్రానికి మంగళవారం మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రానున్నారు. నల్గొండ జిల్లాలో BRS పార్టీ బలపరిచి గెలుపొందిన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను కలిసి KTR అభినందిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్దకు సమయానికి హాజరుకావాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు.
News December 23, 2025
MNCL: నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం

2026 మార్చిలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌లో తప్పులు ఉంటే సవరించేందుకు ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. విద్యార్థుల వార్షిక మెమోలలో ఎలాంటి తప్పులు రాకుండా, అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం మార్పులు ఉంటే పాఠశాల ఎస్ఎస్సీ లాగిన్ ద్వారా ఎడిట్ చేసుకోవాలని సూచించారు.
News December 23, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 23, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.25 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.12 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.48 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.06 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


