News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 21, 2025
NZB: 9 నెలల పసికందు విక్రయం.. ఇద్దరిపై కేసు

9 నెలల బాబును విక్రయించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు NZB వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. KMRకు చెందిన సీమ, షరీఫ్ NZB రైల్వే స్టేషన్ వద్ద 9 నెలల బాబుతో భిక్షాటన చేస్తూ ఉంటున్నారు. వారి వద్ద ప్రస్తుతం బాబు కనిపించకపోవడంతో విక్రయించినట్లు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు వెళ్లింది. వారు విచారణ జరిపి నిర్దారించారు. సీమ, షరీఫ్‌పై కేసు నమోదు చేశారు.
News December 21, 2025
సిరి గోల్డ్‌తో నాకు సంబంధంలేదు: BJP ఖమ్మం చీఫ్

సిరి గోల్డ్ వ్యాపారంతో తనకెలాంటి సంబంధంలేదని BJP ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టంచేశారు. రాజకీయంగా ఎదురుకోలేకే అందులో పెట్టుబడులు పెట్టానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. త్వరలోనే వారిపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. ప్రజలు ఈ నిరాధార ఆరోపణలు నమ్మొద్దని కోరారు.
News December 21, 2025
ప్రకృతి సేద్యంలో ఈ ద్రావణాలు కీలకం.. తయారీ ఎలా?

ప్రకృతి సేద్యం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే నేడు చాలా మంది రైతులు ప్రకృతి సాగువైపు అడుగులేస్తున్నారు. ఈ విధానంలో తొలుత లాభాలు ఆలస్యమైనా, కొంత కాలానికి రసాయన సాగు చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. ప్రకృతి సేద్యంలో అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం కీలక పాత్ర పోషిస్తాయి. వీటి తయారీ విధానం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


