News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 14, 2026

తూ.గో: పుష్కరాల నిర్వహణపై పవన్ దిశానిర్దేశం

image

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లతో పాటు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పవన్ సూచించారన్నారు.

News April 14, 2026

GNT: రేపు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం

image

పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో అన్న క్యాంటీన్‌ను రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది. పేదలకు అతి తక్కువ ధరకే కడుపునిండా భోజనం అందించే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తోంది.

News April 14, 2026

రోడ్డెక్కితే భార్యా, పిల్లలు గుర్తుకు రావాలి: ఎస్పీ

image

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారుడు తమ భార్యా, పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇంటి నుంచి బయటకు రావాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు ఇతర ట్రాఫిక్ నియమాలను కూడా కచ్చితంగా పాటించాలని సూచించారు. విధుల్లో రోడ్లపై పోలీసులు ఉన్నా లేకపోయినా భాద్యతగా రూల్స్ పాటించి భాద్యత గల పౌరులుగా మెలగాలని ప్రతిజ్ఞ చేయించారు.