News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 5, 2026

NLG: సెల్‌ఫోన్ పక్కనపెట్టి.. లైబ్రరీకి వెళ్దాం!

image

స్మార్ట్‌ఫోన్ల వ్యసనంతో పిల్లల్లో పుస్తక పఠనం తగ్గి ఆలోచనా శక్తి దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి సెలవులు, ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల సమయం వృథా కాకుండా వారిని గ్రంథాలయాలకు పంపాలని సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండలోని 3 జిల్లా, 64 శాఖా గ్రంథాలయాల్లో ఏకంగా 1,07,951 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు ఈ విజ్ఞాన భాండాగారాలను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.

News April 5, 2026

వరంగల్: ఎస్సై గారూ.. ఓ లుక్కేయండి..!

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఆర్ఎంపీల పేరిట కొందరు తాయత్తులు, మంత్ర తంత్రాలతో ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దయ్యం, దోషం పేరుతో భయపెట్టి మొదట రూ.500 నుంచి ప్రారంభించి దశలవారీగా రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఇలాంటి మోసాలపై పోలీసులు వెంటనే స్పందించాలని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News April 5, 2026

IPL హీట్: టాలీవుడ్ కలెక్షన్లకు గండి!

image

IPL మ్యాచ్‌లు ఉండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆడియెన్స్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాకాస’, ‘బైకర్’ వంటి సినిమాలకు మ్యాచ్‌ల సెగ తగులుతోంది. ఏప్రిల్ 10న రాబోతున్న ‘డెకాయిట్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాలకు కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. మే నెలాఖరు వరకు IPL సందడి కొనసాగనుంది. కంటెంట్ బాగుంటే తప్ప ఈ ‘క్రికెట్ తుఫాను’ను తట్టుకోవడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.