News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 14, 2026

‘మహిళా బిల్లు’.. జగన్‌కు చంద్రబాబు లేఖ

image

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే ‘ నారీ శక్తి వందన్ అధినయం’ బిల్లుకు మద్దతివ్వాలని CM చంద్రబాబు YCP, JSP చీఫ్‌లు జగన్, పవన్ కళ్యాణ్ సహా అన్ని పార్టీల అధినేతలకు, MPలకు లేఖ రాశారు. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కల్పించాలన్న PM మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో, పాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని CBN అభిప్రాయపడ్డారు.

News April 14, 2026

ఏలూరు రూరల్ PS హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

image

విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జీవరత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కొందరిని వీఆర్‌కు పంపిన ఎస్పీ, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తప్పవని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

News April 14, 2026

విశాఖ-బ్రహ్మపూర్ రైలు రీషెడ్యూల్

image

విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయింది. లింక్ రైలు ఆలస్యంగా రావడంతో సాయంత్రం 5:45 గంటలకు బదులు 6:45 గంటలకు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని, వారికి కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.