News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 14, 2026

BREAKING.. సంగారెడ్డి: పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి

image

సంగారెడ్డి జిల్లాలో పోలీసు వాహనం ఢీకొని ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతిచెందాడు. మనూర్ పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి వాహనం ఏఎస్ఐ పైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. డ్రైవర్ రామారావు పరారీలో ఉండగా, కక్షపూరితంగానే ఇలా చేశాడని ఏఎస్ఐ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.

News April 14, 2026

HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

image

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.

News April 14, 2026

SRCL: ‘ఆస్పత్రిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. సోమవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. గత మూడు నెలల్లో ఔట్ పేషెంట్ లు 60,579 మంది, ఇన్ పేషెంట్ 3,939 మంది నమోదయ్యారని వైద్యులు కలెక్టర్‌కు తెలిపారు. జనవరి నుంచి మేజర్ ఆపరేషన్లు 365, మైనర్ ఆపరేషన్లు 993 చేశామని వెల్లడించారు.