News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 8, 2026

కాళేశ్వరం, దేవాదుల మోటార్లు పాడయ్యేలా కుట్ర: హరీశ్

image

TG: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదేపదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతోందని, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఉత్తమ్‌కు రాసిన లేఖలో ప్రశ్నించారు.

News April 8, 2026

రెపో రేటు యథాతథం.. ప్రకటించిన RBI

image

వడ్డీ రేట్లలో RBI ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ(MPC) నిర్ణయాలను ఆయన మీడియాకు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి EMIలలో పెద్దగా మార్పులు ఉండవు. కాగా 2025 FEB-DEC మధ్య <<19064412>>రెపో రేటు<<>>ను 1.25% తగ్గించిన RBI.. ఈ ఏడాది తొలి సమీక్షలో 5.25%గానే కొనసాగిస్తున్నట్లు చెప్పింది.

News April 8, 2026

ఆదిలాబాద్: నిధుల కోసం ‘స్నేహ’ హస్తం

image

సీఎం సభలో విపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ పురోగతి కోసం విభేదాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా విపక్ష నేతలు స్పష్టం చేయడం గమనార్హం.
మొండిగా వెళ్లకుండా అభివృద్ధి విషయంలో సానుకూలంగా స్పందించడం పట్ల సీఎం సైతం హర్షం వ్యక్తం చేశారు.