News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

అనకాపల్లి: 21న జడ్పీ స్థాయి సమావేశాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు సీఈవో నారాయణమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన విశాఖ జడ్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ మేరకు జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలన్నారు.

News February 17, 2026

VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందిన ఘటన అనకాపల్లి(D) కె.కోటపాడులోని సూర్రెడ్డిపాలెం జంక్షన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన బండారు దేముడునాయుడు(30) బైక్ పై సబ్బవరం వెళ్తుండగా సూర్రెడ్డిపాలెం వద్ద అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 17, 2026

HYD: ఈ అలవాట్లతో ప్రాణానికి ముప్పు!

image

మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం యువత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం, ఉప్పు-చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపారు. విపరీతమైన స్క్రీన్ టైమ్ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీ రాళ్లకు దారితీస్తోందని సూచించారు. కాలుష్యం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారాయన్నారు.