News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 5, 2026
SRH Vs LSG: పిచ్ రిపోర్ట్ ఇదే..

నేడు ఉప్పల్‌లో SRH, LSG మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. హోమ్ గ్రౌండ్‌లో విజయం కోసం ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది. ఇక్కడి పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఫ్లాట్ ట్రాక్, ఫాస్ట్ ఔట్‌ఫీల్డ్, చిన్న బౌండరీల వల్ల పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ ఆరంభంలో కొత్త బాల్‌తో ఫాస్ట్ బౌలర్లకు కలిసి రావొచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకొని 220-230 పరుగుల టార్గెట్‌ను ఫిక్స్ చేయొచ్చని అంచనా.
News April 5, 2026
ఖమ్మం: అధికారులకు ‘వెలుగుమట్ల’ సెగ..!

వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోర్టు ఆదేశాలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య అధికారులు చిక్కుకుపోయారు. ఇటీవల కూల్చివేతల రోజే RDO బదిలీ కావడం, తాజాగా అర్బన్ MRO బదిలీతో వ్యవహారం ముదిరింది. బాధితులకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించినా, అర్హుల జాబితాలో అక్రమాలపై విమర్శలొస్తున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక ఓ ఉన్నతాధికారి సైతం బదిలీ కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News April 5, 2026
ప్రకాశం: జూన్‌లో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుకు ఆదేశం

ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.


