News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 9, 2026

పాలమూరు: డిగ్రీ కళాశాల.. కోర్సులు ఇవే

image

మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 1.B.Sc. (MPC/CS), 2.B.Sc.(MZC), 3.B.Sc. (MSCS/DS), 4.B.Com.(BA), 5.B.Sc.(BZC), 6.B.Com.(CA), 7.В.А.(HEP) కోర్సులు ఉన్నాయన్నారు. ఎన్ఎస్ఎస్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం ఉందన్నారు. అవసరమైన వారికి SHARE IT.

News March 9, 2026

ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News March 9, 2026

ASF: ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు: కలెక్టర్

image

ASF జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరచిన గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాం వద్ద 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు.