News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 5, 2026

మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యంశాలు!

image

@మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత
@మహమ్మదాబాద్ లో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
@ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
@దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
@భూత్పూర్: 44వ జాతీయ రహదారిపై దారి బోల్తా- డ్రైవర్ కు గాయాలు
@అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి
@రాజాపూర్ మండల కేంద్రంలో.. చలివేంద్రంను ప్రారంభించిన సర్పంచ్

News April 4, 2026

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ

image

గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విడుదల చేయాలని కోరారు. బహిరంగంగా కుదరకపోతే తమకైనా ఆ వివరాలు ఇవ్వాలన్నారు. విమానం ఎందుకు కూలిందో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫ్లైట్‌లోని 242 మందికి గాను 241 మంది, 19 మంది ఇతరులు మరణించిన విషయం తెలిసిందే.

News April 4, 2026

రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

image

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.