News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 6, 2026
కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలి: జలగం ప్రసాదరావు

ఎన్పీడీసీఎల్ ఈఆర్సీ మీటింగ్‌లో మాజీమంత్రి జలగం ప్రసాదరావు పాల్గొన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కొరకు కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. సబ్ స్టేషన్‌లో పూర్తిగా ఆపరేటర్లను నియమించాలని, కొత్తగా 220 కేవీ నుంచి 33 కేవీ కొత్త లైన్ కమలాపూర్ వరకు ఏర్పాటు చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం గుండాలలో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మించాలన్నారు.
News March 6, 2026
రూ.9.8 లక్షల కోట్ల ఆస్తితో ముకేశ్ నంబర్-1

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026లో IND నుంచి ముకేశ్ అంబానీ(రిలయన్స్ ఇండస్ట్రీస్) ₹9.8 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో గౌతమ్ అదానీ(₹7.5L Cr), రోష్నీ నాడార్ మల్హోత్రా-HCL(₹3.2L Cr), పూనావాలా-సీరమ్ ఇన్‌స్టిట్యూట్(₹3L Cr), కుమార మంగళం బిర్లా-ఆదిత్య బిర్లా(₹2.5L Cr), దిలీప్ సంఘ్వీ-సన్ ఫార్మా(₹2.3L Cr), అజీమ్ ప్రేమ్‌జీ-విప్రో(₹2.3L Cr), నీరజ్-బజాజ్ ఆటో(₹2.2L Cr) ఉన్నారు.
News March 6, 2026
కామారెడ్డి: కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి

కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు వినతిపత్రం అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో సొంత పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే స్థలం కేటాయించి సహకరించాలని వారు కలెక్టర్‌ను కోరారు.


