News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 15, 2025

వంగూర్: అప్పుడు 2 ఓట్ల తేడాతో ఓడి.. ఇప్పుడు 909 ఓట్ల మెజార్టీతో గెలిచారు!

image

గతంలో కేవలం రెండు ఓట్ల తేడాతో ఓడిపోయిన యాదయ్య, ఈసారి వంగూరు మండల సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలుపొందారు. మొదటి విడత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి రమేష్‌గౌడ్‌పై 909 ఓట్ల మెజారిటీ సాధించి విజయం వరించారు.

News December 15, 2025

భద్రాద్రి: వాగులు, వంకలు దాటొచ్చి.. ప్రజాస్వామ్యాన్ని చాటి!

image

అశ్వారావుపేట(M) రేగళ్లగుంపునకు చెందిన గొత్తికోయలు ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ 97 మంది ఓటర్లు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి కారడవి మార్గంలో ప్రయాణించారు. వారు రాళ్లూరప్పల దారుల్లో, వాగులు, వంకలు దాటుతూ 8 KM దూరం కాలినడకన వెళ్లి బచ్చువారిగూడెం పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News December 15, 2025

NGKL: ఓడిన అభ్యర్థులకు డబ్బులు తిరిగి ఇస్తున్న ఓటర్లు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ, వంగూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థులకు ఓటర్లు వారు ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇస్తున్నట్లు సమాచారం. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓడిపోయిన అభ్యర్థులు విలపించడం చూసి చలించిపోయిన కొందరు ఓటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.