News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

పార్వతీపురం: గిరిజన ప్రాంతాలు మౌలిక వసతులుపై సమవేశం

image

గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులుపై జిల్లా కలెక్టర్లుతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం సమావేశం నిర్వహించారు. అమరావతిలోని మంత్రి కార్యాలయంలో అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లా అల్లూరి, పార్వతీపురం కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలుతో చర్చించారు. ప్రజలు సంక్షేమం, లా అండ్ ఆర్డర్, గిరిజనాభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు.

News February 16, 2026

17కి డోర్నకల్ మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారం వాయిదా

image

డోర్నకల్ మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం రేపటికి వాయిదా పడింది. హైదరాబాదు క్యాంపు నుంచి డోర్నకల్‌కు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు చేరుకున్నారు. మరిపెడ లో కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే మరిపెడలో ఉండిపోవడంతో డోర్నకల్ ప్రమాణ స్వీకారానికి మధ్యాహ్నం ఒకటిన్నర వరకే ఉండడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

News February 16, 2026

బిల్ గేట్స్ ప్రతినిధులతో వర్చువల్‌గా పాల్గొన్న పల్నాడు కలెక్టర్

image

బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ బృందం పాల్గొంది. ఆరోగ్యం, విద్య, సాంకేతిక రంగాల్లో సహకారం పై దృష్టి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యంపై చంద్రబాబు వివరించారు. వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కృత్తికా శుక్లా పాల్గొన్నారు.