News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 5, 2026
హాజరుకాని వారికి నోటీసులు: ZP ఛైర్మన్

చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరవడంతో నోటీసులు పంపించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
News April 5, 2026
సంగారెడ్డి: ఉచిత శిక్షణ.. APPLY

స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫ్రిజ్ & ఏసీ రిపేర్ &సర్వీసింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ యువకులు అర్హులని చెప్పారు. దరఖాస్తులలో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో గాని, 94901 03390 నంబర్‌కు వాట్సప్ చేయాలని సూచించారు.
News April 5, 2026
కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్‌లో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులు, రిట్ పిటిషన్లపై కలెక్టర్ శనివారం శ్యాంప్రసాద్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసులకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్లను వెంటనే దాఖలు చేయాలని, కోర్టు ఇచ్చిన గడువులోగా నివేదికలు సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. న్యాయపరమైన అంశాల్లో నిర్లక్ష్యం చేస్తే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.


