News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News January 29, 2026

ఉగాది నాటికి 9,135 గృహాల పూర్తి: కలెక్టర్ ఆదేశం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు వచ్చే ఉగాది నాటికి 9,135 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆమె ఆదేశించారు. గూగుల్ మీట్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ పిచ్చయ్య పాల్గొన్నారు.

News January 29, 2026

నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్ నంది నగర్‌లో విచారించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాను అక్కడి నివాసంలో అందుబాటులో ఉంటానని BRS అధినేత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సిట్ బృందం, పోలీసులు కేసీఆర్ ఇంటి దగ్గర భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కాగా ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, ఇతర ముఖ్య నేతలను జూబ్లీహిల్స్ PSలో విచారించారు.

News January 29, 2026

T20 WCకు ముందు వాషింగ్టన్ సుందర్‌కు ఫిట్‌నెస్ టెస్ట్

image

NZతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్ Feb 4న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ ఎదుర్కోనున్నారు. T20 WC ప్రారంభానికి కేవలం 3 రోజుల ముందే ఈ పరీక్ష జరగనుండటంతో ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. సుందర్ కోలుకోవడానికి సమయం పడుతున్నా మేనేజ్‌మెంట్ ఇంకా ఎవరినీ రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించలేదు. ఒకవేళ ఆయన ఫిట్ కాకపోతే.. రియాన్ పరాగ్ రేసులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.