News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 17, 2025
వెయ్యి ఓట్ల మెజారిటీతో కాళేశ్వరంలో బీఆర్ఎస్ గెలుపు

మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి గెలుపొందారు. సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్‌కి సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.
News December 17, 2025
బాంబ్ డిస్పోజల్ టీంకు రెండు రోజుల శిక్షణ

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో BD టీం (బాంబ్ డిస్పోజల్ టీం)కు సంబంధించి రెండు రోజుల రిఫ్రెష్‌మెంట్ కోర్స్‌ను ప్రారంభించారు. ఈ కోర్స్ పోలీస్ టీమ్ సభ్యుల ఆచరణాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందని ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. BD టీం సభ్యులకు ఆధునిక సాంకేతికతలు, బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ పద్ధతులపై శిక్షణలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.
News December 17, 2025
కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది: హరీశ్ రావు

TG: రాజ్యాంగాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీ నినాదం ఉద్దేశం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన <<18592868>>తీర్పుతో<<>> బహిర్గతమైందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలతో రాజ్యాంగాన్ని కాలరాసిందని ఫైరయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని మండిపడ్డారు.


