News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 27, 2026
NIRDPRలో 98 ఉద్యోగాలు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)లో 98 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. PG అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50. నెలకు Sr. కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.75K, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.60K చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: career.nirdpr.in/
News January 27, 2026
సంగారెడ్డి: 29, 30 తేదీల్లో పాఠశాలలో మాక్ అసెంబ్లీ

మేడారం సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా పర్యావరణంపై ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. జిల్లా ఎన్జీసీ సమన్వయకర్త మాధవరెడ్డి 94400 69750 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News January 27, 2026
ఢిల్లీ హైకోర్టులో పవన్ కుమారుడికి ఊరట

AP Dy.CM పవన్ కుమారుడు అకీరానందన్‌పై <<18950891>>AI వీడియో<<>> చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తన పేరుతో SMలో ఉన్న నకిలీ పేజెస్ తొలగించాలని కోరారు. హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. AI లవ్ స్టోరీపై నిషేధం విధించింది. SM పేజెస్ తొలగించాలని, IP వివరాలు బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్ వంటి సంస్థలకు నోటీసులు ఇచ్చింది.


