News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

BIG BREAKING: నర్సాపూర్‌లో ఒక్కటైన కాంగ్రెస్, BJP

image

నర్సాపూర్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్, BJP ఒక్కటయ్యాయి. మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్‌ 6, BRS 5, BJP 4 వార్డులు గెలిచాయి. హంగ్ ఏర్పడగా ఈరోజు కాంగ్రెస్, BJP జతకట్టి పీఠం దక్కించుకున్నాయి. ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ 5వ వార్డు కౌన్సిలర్ మాచునూరి లక్ష్మి ఎన్నికవగా, వైస్ ఛైర్మన్‌గా 13వ వార్డు కౌన్సిలర్ బుచ్చేశ్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. దీంతో కాంగ్రెస్, BJP నేతలు కలిసి సంబరాలు జరిపారు.

News February 16, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.15,720
* 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.14,462
* వెండి 10 గ్రాముల ధర రూ.2,505.

News February 16, 2026

కాంగ్రెస్‌దే తొర్రూరు?

image

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మునిసిపాలిటీ కాంగ్రెస్ వశమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన ఓ అభ్యర్థి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు సాధించినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొర్రూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.