News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 17, 2025
నర్సింహునిపేట సర్పంచ్‌గా రాజమణి గెలుపు

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేట గ్రామ సర్పంచ్‌గా సంది రాజమణి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి వడియాల అరుణపై 78 ఓట్ల ఆదిక్యంతో రాజమణి గెలిచారు. ఇక్కడ వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, సర్పంచ్‌గా ఇద్దరు బరిలో ఉన్నారు. కాగా, రాజమణి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించినట్లు పార్టీ నాయకుల పేర్కొన్నారు.
News December 17, 2025
యాదాద్రి: యువకుడి దారుణ హత్య..!

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బురుజుబావి గ్రామంలో ఓ యువకుడు బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడు బురుజుబావి గ్రామానికి చెందిన గడ్డం దావీదు (29)గా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 17, 2025
రాజన్న సిరిసిల్లలో వెలువడిన తొలి ఫలితం

వీర్నపల్లి మండలం బావుసింగ్ నాయక్ తండా గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గూగులోతు రమేశ్ విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి భూక్యా మురళిపై 107 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా ఇంద్రానగర్ గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


