News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 14, 2026

డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ

image

అక్రమ సరోగసీ, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న <<17824045>>సృష్టి<<>> ఆసుపత్రి వైద్యురాలు నమ్రతను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఫర్టిలిటీ సెంటర్ పేరుతో 2014 నుంచి అక్రమ వ్యవహారాలు నడిపినట్లు దర్యాప్తులో గుర్తించింది. గతంలో మెడికల్ లైసెన్స్ సస్పెండ్ అయినా కార్యకలాపాలు కొనసాగించినట్లు పేర్కొంది. ఇటీవల ఆమెపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది.

News February 14, 2026

10నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

image

కేరళలో రోడ్డుప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పది నెలల పసికందు అలిన్ షెరిన్ ఐదుగురికి ప్రాణం పోసింది. ఈ నెల 5న జరిగిన ప్రమాదంలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేరగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వారి విజ్ఞప్తితో చిన్నారి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. క్లిష్ట సమయంలోనూ పేరెంట్స్ నిర్ణయాన్ని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసించారు.

News February 14, 2026

సిద్దిపేట: జాగ్రత్త.. బుట్టలో వేసి.. లక్షలు దోచేస్తున్నారు!

image

మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసు హెచ్చరించారు. ప్రధానంగా NRI, పెద్ద వ్యాపారవేత్తలమని నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారని తెలిపారు. పరిచయం పెంచుకున్నాక అత్యవసరాలు, స్టాక్స్, ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ పెట్టుబడుల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని వివరించారు.