News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 9, 2026

శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్‌కు..రైతుకు రీలిఫ్ అందెనా?

image

ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీరు అందేనా? అన్న అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతుంది. వంశధార కాలువలలో పూడిక, గుర్రపు డెక్క నిండిపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు పారడం లేదు. జిల్లాలో వంశధార ఎడమ కాలువ ద్వారా సుమారు 2,11,030 ఎకరాలు సాగవుతుంది. ఉపాధి హామీ నిధులతోనైనా పిల్ల కాలువలు కాలువలలోని పూడిక తీత పనులు నిర్వహించి కాలువలను ఆధునీకరిస్తే శివారు ప్రాంత రైతుల ఆశలు నెరవేర్చవచ్చు.

News March 9, 2026

రుణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో చేరుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణంతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగాలకు రుణాల పంపిణీపై సమీక్షించారు. యువతకు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించి ఆర్థిక చేయూత అందించాలని సూచించారు.

News March 9, 2026

నల్గొండ: మార్చి 10 నుంచి పశువులకు టీకాలు

image

నల్గొండ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి. రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పశువులకు టీకాలు వేసేందుకు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా జరిగే ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.