News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 20, 2025
విద్యార్థులందరికీ దంత పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులెవరూ దంత సమస్యలతో బాధపడకూడదని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో విద్యార్థుల చికిత్స తీరును ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించి, 1500 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23లోగా తొలి విడత పూర్తి చేసి, జనవరి 1 నుండి రెండో విడత శిబిరాలు ప్రారంభించాలని వైద్యులకు సూచించారు.
News December 20, 2025
ఆ వాహనాలు ఎవరికోసమో….?

తిరుపతి డివిజన్‌లో డిసెంబర్ 20న సీజ్ చేసిన వాహనాల వేలం నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ వేలంలో మొత్తం 375 వాహనాలకు టెండర్లకు ఆహ్వానం ఇచ్చినా 305 వాహనాలకే టెండర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. 70 వాహనాల వివరాలను రౌండప్ చేసి, వాటిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వేలంలో పాల్గొనే వారిలో తీవ్ర అయోమయం నెలకొంది. ఆ వాహనాలు ఎందుకు పక్కనబెట్టారనే విమర్శలు వస్తున్నాయి.
News December 20, 2025
మల్లాపూర్: శ్రీశైలం సేవకు వెళ్లి మహిళ మృతి

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటకి చెందిన మహిళా శ్రీశైలంలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. స్థానికులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాడారపు లక్ష్మి వారం రోజుల క్రితం శ్రీశైల దేవస్థానంలో సేవకై, మెట్‌పల్లికి చెందిన బృందంతో వెళ్ళింది. చివరి రోజు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరణానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.


