News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 14, 2026

అడ్వకేట్ సుబ్బారావుపై సీపీ సజ్జనార్‌కు మంగ్లీ ఫిర్యాదు

image

తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అడ్వకేట్ సుబ్బారావుపై కఠినచర్యలు తీసుకోవాలని సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సీపీ సజ్జనార్‌ను కలిసి ఆమె ఫిర్యాదు అందజేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.

News April 14, 2026

TPG: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన తాడేపల్లిగూడెం మండలం పడాల ఒక పత్రిక కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వివరించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News April 14, 2026

TU: M.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఏం.ఈడి మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 24 నుంచి 30వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు మధ్యాహ్నం 2-5 గం.ల వరకు, 29, 30 తేదీల్లో నిర్వహించే పరీక్షలు మధ్యాహ్నం 2- 3.30 గం.ల వరకు జరుగుతాయని తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడాలన్నారు.