News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 5, 2026
ఖమ్మం డీసీసీబీకి రాష్ట్రంలో రెండో స్థానం

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.4338 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది. ఈ మేరకు సీఈవో NV ఆదిత్య శనివారం తెలిపారు. గతేడాదితో పోలిస్తే రూ.878 కోట్ల వ్యాపారం పెరిగిందన్నారు. 2024-25లో రూ.5.30 కోట్ల లాభాలు నమోదు కాగా, ఈ ఏడాది రూ.30 కోట్ల లాభాలు సాధించింది. సంఘం వాటాదారులకు రూ.6 కోట్ల డివిడెండ్ అందించినట్లు వెల్లడించారు.
News April 5, 2026
కారుణ్య నియామకానికి ఏడాదిలోపే అప్లై చేయాలి: HC

TG: ఉద్యోగి మరణించిన ఏడాదిలోపే కుటుంబ సభ్యులు కారుణ్య నియామకం కోసం అప్లై చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఏడాది తర్వాత దరఖాస్తు చేస్తే ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉంటేనే నియామకం వర్తిస్తుందని చెప్పింది. ఉద్యోగి భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, కుటుంబం ఆర్థికంగా బాగున్నా కారుణ్య నియామకానికి అర్హులు కారని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా పేర్కొంది.
News April 5, 2026
ఈవీ వాహన లోపం.. ఖమ్మం కోర్టు సంచలన తీర్పు

ఎలక్ట్రిక్ వాహన మైలేజీ విషయంలో మోసపోయిన వినియోగదారుడికి ఖమ్మం వినియోగదారుల కమిషన్ ఊరటనిచ్చింది. పాల్వంచకు చెందిన నాగేశ్వరరావు ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు.. వాహన ధర రూ.54,810తో పాటు మానసిక వేదనకు రూ.75 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్‌ను ఆదేశించింది. బాధితుడికి మొత్తం రూ.1,39,810లు చెల్లించాలని శనివారం వెలువరించిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.


