News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News January 28, 2026

రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యం: కలెక్టర్

image

గిరిజన మారుమూల గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కృషిచేస్తున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. కురుపాం నియోజక వర్గంలోని కొమరాడ మండలంలోని పలు రహదారి పనులను కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరితో కలిసి కలెక్టర్ బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.23.44 కోట్లతో 11 డోలీ గ్రామాల్లోని 60 బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.

News January 28, 2026

సంగారెడ్డి: ‘ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి’

image

ఎన్నికల విధులలో అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టాటిక్ సర్వే లైన్స్, ఫ్లయింగ్ స్కాట్స్ నిఘా బృందాల అధికారులకు జోనల్ అధికారులకు బుధవారం కలెక్టరేట్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంయమనంతో వ్యవహరించాలని ఎన్నికల వ్యయ ప్రచార సరళీని తనిఖీ చేయాలన్నారు.

News January 28, 2026

ఎమ్మెల్యేకు నేనే రూ.7 లక్షలు ఇచ్చాను: బాధితురాలు

image

తన డిమాండ్ డబ్బు కాదని, కేవలం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు చట్ట ప్రకారం శిక్ష పడాలని బాధితురాలు కోరింది. మీరు ఎమ్మెల్యేను రూ.25 కోట్లు డిమాండ్ చేశారంట కదా అని అడగగా.. ఎమ్మెల్యే దగ్గర ఏం లేదని, ఆయనకే తానే రూ.7 లక్షలు ఇచ్చానని ప్రెస్‌మీట్లో చెప్పుకొచ్చారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎక్కడికైనా వస్తానని తెలిపారు.