News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 15, 2025

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆంక్షలు అమలు: సీపీ

image

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 17న జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా BNSS163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట, దూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల నుంచి 18 సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News December 15, 2025

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్‌లైన్‌ క్లాసులు

image

ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరందరికీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. అన్ని పాఠశాలలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే 228 విమానాలు రద్దయ్యాయి.

News December 15, 2025

మూడో విడత 9 మండలాల్లో ఎన్నికలు

image

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 17వ తేదీన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 9 మండలాల్లో జరగనున్నాయి. అక్కన్నపేట, దూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, కొండపాక, కుకునూరుపల్లిలో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో 163 సర్పంచ్ స్థానాలు, 1432 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 13 సర్పంచ్ స్థానాలు, 249 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.