News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 15, 2025
ముస్తాబాద్: యంత్రాలతో వరిగడ్డి కట్టలు.. రూ. 40 వేలు ఆదా

ముస్తాబాద్ ప్రాంతంలో వరి నూర్పిడి తర్వాత పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టడం వల్ల కాలుష్యం, భూసారం నష్టం జరుగుతున్నప్పటికీ 75 శాతం మంది రైతులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. అయితే, కొందరు రైతులు యంత్రాల సహాయంతో వరిగడ్డిని కట్టలుగా చేసి, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు సుమారు రూ.40 వేల వరకు ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. ఇది పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని అధికారులు పేర్కొన్నారు.
News December 15, 2025
క్రమంగా పుంజుకుంటోన్న అరటి ధరలు

AP: గత నెలలో కిలో రూ.2కు పడిపోయిన అరటి ధరలు.. ఉత్తరాది వ్యాపారుల కొనుగోలుతో ఇప్పుడు పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం కిలో అరటి ధర కనీసం రూ.10, గరిష్ఠంగా రూ.16, రూ.17గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో అరటి సాగు పెరగడం, తక్కువ ధరకే నాణ్యమైన అరటి లభించడంతో ఉత్తరాది వ్యాపారులు అక్కడి సరుకునే కొనడంతో.. ఏపీలో అరటి ధర భారీగా పతనమై ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలకు ఎగుమతి నిలిచింది.
News December 15, 2025
VJA: ‘DCO కార్యాలయాల వద్ద సహకార ఉద్యోగుల నిరసన’

సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆందోళనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని జిల్లా సహకార అధికారి (DCO) కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. సహకార సంఘాలను మూసివేసి, ఓడీ లాగిన్ చేయకుండా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు బొల్లినేని రఘురాం కోరారు.


