News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 15, 2025

త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన.. ఎలాంటి మార్పులుంటాయో!

image

మంత్రివర్గ ప్రక్షాళనపై <<18568106>>TPCC చీఫ్<<>> ప్రకటనతో క్యాబినెట్‌ మార్పులపై చర్చ మొదలైంది. ఎవరినైనా తప్పిస్తారా లేదా శాఖలను మారుస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో ఎవరికి ఛాన్సిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మల్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి వారు మంత్రి పదవి ఆశిస్తున్నారు. కాగా పొన్నం, సురేఖను తొలగిస్తారన్న ప్రచారాన్ని మహేశ్ ఖండించారు.

News December 15, 2025

తిరుపతి బస్టాండ్‌లో ఇదొక దందా..!

image

తిరుపతి బస్టాండ్ మరుగుదొడ్లలో మూత్ర విసర్జన ఉచితం. కానీ రూ.10 వసూలు చేస్తున్నారు. మల విసర్జనకు రూ.5 కాగా రూ.20 తీసుకుంటున్నారు. లోపలికి వెళ్లేటప్పుడే డబ్బు ఇవ్వాలని ప్రయాణికులతో అక్కడి మహిళలు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రూ.10, రూ.15 తేడా అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. లక్షలాది మంది రాకపోకలు సాగించే ఈ బస్టాండ్‌లోని షాపుల్లో MRPకి మించి విక్రయాలు చేస్తున్నారు.

News December 15, 2025

45ఏళ్లలోపు వారికి గుండెపోటు ప్రమాదం.. కారణాలివే!

image

ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 45 ఏళ్లలోపు వారిలో సంభవించే ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని IJMR <<18568129>>నివేదిక<<>> హెచ్చరించింది. ఒత్తిడి, జీవనశైలి, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు యువత గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. యువత తమ జీవనశైలిని మార్చుకోవాలని, గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT